Back to Home
Watermark
బుధవారం, 16 సెప్టెంబర్, 2026 TIME : 01:57 PM

కరీంనగర్‌లో అత్యాధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖులు

Main Image

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

తెలంగాణ ప్రభుత్వం మరియు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించడం జరిగింది. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన ఈ భారీ కిచెన్‌ను వారు పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు, పాల కేంద్రం, ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు, చట్నీ పౌడర్ తయారీ మిషన్లను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించి, వాటి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.

Additional Image

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్ర విశ్వాసరావు, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments