Back to Home
Watermark
బుధవారం, 16 సెప్టెంబర్, 2026 TIME : 02:11 PM

కరీంనగర్ అభివృద్ధికి పెద్దపీట పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Main Image

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

కరీంనగర్ నగర రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నామని, ఇందులో భాగంగా నగరంలోని వివిధ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది.ప్రారంభించిన మరియు శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:42వ డివిజన్: భగత్ నగర్ (మమత థియేటర్, పొలాడి ఆనందరావు అపార్ట్మెంట్ గల్లీ)లో పూర్తయిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో రూ. 50 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.49వ డివిజన్: భాగ్యనగర్ (బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో) రూ. 50 లక్షల UIDF నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు అలాగే పోచమ్మ కమాన్ సమీపంలో రూ. 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.13వ డివిజన్: శివనగర్ బైపాస్ రోడ్ (లారెల్ స్కూల్ వద్ద) రూ. 75 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ పనులన్నింటినీ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Clip Adjustments