Back to Home
Watermark
బుధవారం, 16 సెప్టెంబర్, 2026 TIME : 02:25 PM

ప్రభుత్వ నాలా భూమిని కబ్జా చేసి నకిలీ లే అవుట్ ఇద్దరు అరెస్ట్

Main Image

ఆదిలాబాద్ / తెలంగాణ అడ్డా:

బంగారిగూడ సమీపంలో ప్రభుత్వ నాలా భూమిని ఆక్రమించి 24 ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నకిలీ లే అవుట్ ఏర్పాటు చేసి బౌండరీలు, రాళ్లు ఏర్పాటు చేయగా.. వాటిని తొలగించారు. అలాగే వారి వద్ద నుండి రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్ల నకలు కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ రహీం పాషాతెలిపారు.అరెస్టయిననిందితులు:మొలుగురి విజయ్ కుమార్ (48), తండ్రి:రాజపోశమ్, ఖానాపూర్, ఆదిలాబాద్.రావ్రని పరేష్ (48), తండ్రి: దిలీప్, GS ఎస్టేట్, NH రోడ్, ఆదిలాబాద్. ప్రస్తుత నివాసం:మావల.ప్రజలకు సూచన:భూమి కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు, లే అవుట్ అనుమతులు పూర్తిగా పరిశీలించాలని, మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

Clip Adjustments