Back to Home
Watermark
బుధవారం, 16 సెప్టెంబర్, 2026 TIME : 04:33 PM

కల్పిత నాయకుడు’ పుస్తకావిష్కరణను రద్దు చేయాలి: దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్

Main Image

గంగాధర, తెలంగాణ అడ్డా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అసత్య, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ‘కల్పిత నాయకుడు’ పుస్తకావిష్కరణను తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం గంగాధర మండల శాఖ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గంగాధర ప్రవీణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవిత చరిత్ర, సిద్ధాంతాలు, దేశానికి ఆయన అందించిన సేవలను వక్రీకరించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేదా ప్రచురణలు ఉండకూడదన్నారు. పుస్తకంలోని అభ్యంతరకర అంశాలను అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపட்சంలో ఈ అంశంపై ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గునుకొండ బాబు, దళిత సర్పంచులు కొలిలేపాక కవిత, మల్లేష్, దళిత సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లింగాల దుర్గయ్య, అధిమల్లు, సముద్రాల అజయ్, మీర్జా కొండయ్య, మాజీ ఎంపీటీసీలు గంగాధర రాజయ్య, న్యాతరి శివశంకర్, కార్యదర్శి తుందుర్తి చంద్రశేఖర్, దళిత సినీ నాయకులు దోమకొండ మల్లన్న, తాళ్ల స్వామి, తాళ్ల నరేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గంగాసాగర్, శనిగరపు నరేష్, గంగాధర నాగేష్, అఖిల్, బొడ్డు నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments