Back to Home
Watermark
బుధవారం, 16 సెప్టెంబర్, 2026 TIME : 05:30 PM

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.అసెంబ్లీలో సంచలన ప్రకటన

Main Image

హైదరాబాద్ / తెలంగాణ అడ్డా:

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ కుటుంబ భూముల వివరాలను ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించిన సీఎం.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ జరపాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 295 ఎకరాల భూమి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందా లేదా తేల్చాలని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతానని, శుద్ధి చేసిన చోటే దళితులకు భూములిచ్చి వారిని యజమానులను చేస్తానని ఘంటాపథంగా చెప్పారు.కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల వివరాలు:సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానికి: 67.5 ఎకరాలుకేటీఆర్ కుటుంబానికి: 123 ఎకరాలు

హరీశ్‌రావు కుటుంబానికి: 30 ఎకరాలు

కల్వకుంట్ల కవిత కుటుంబానికి: 37 ఎకరాలు

జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి: 79 ఎకరాలునవీన్‌రావుకు: 52 ఎకరాలు

కొండల్‌రావుకు: 48 ఎకరాలు

మొత్తంగా కల్వకుంట్ల కుటుంబానికి రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో, 31 గ్రామాల్లో 439 ఎకరాల భూములు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.

Clip Adjustments