Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 10:25 AM

కీసరలో ఏసీబీ అధికారుల దాడి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ, సీఐ అరెస్ట్

Main Image

కీసర / తెలంగాణ అడ్డా:

​మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయించడానికి సీఐ ఆంజనేయులు ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేయగా, చివరకు రూ. 8,35,000/- లకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. సీఐ సూచన మేరకు మొదటి విడతగా రూ. 5 లక్షల లంచం సొమ్మును తీసుకుంటుండగా గురువారం అర్ధరాత్రి కీసర పెద్దమ్మ చెరువు (చెరువు గట్టు) వద్ద ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి బాధితుడి నుంచి డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులను గమనించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా కెమికల్ టెస్టులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టారు.అయినప్పటికీ ఏసీబీ అధికారులు అప్రమత్తమై ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డితో పాటు లంచం వ్యవహారంలో ఉన్న సీఐ ఆంజనేయులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

Clip Adjustments