Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 10:29 AM

భూ సర్వే, రీ-సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన సదస్సు. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్

Main Image

వీర్నపల్లి / తెలంగాణ అడ్డా:

మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ సర్వే, రీ-సర్వే ప్రక్రియపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.భూముల సరిహద్దు తగాదాలు, రికార్డుల డిజిటలైజేషన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ సర్వే, రీ-సర్వే వల్ల రైతులకు చేకూరే ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా సవివరంగా వివరించారు. రైతులు తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలను సర్వే అధికారులకు సమర్పించి, ఈ సర్వే ప్రక్రియను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ కోరారు. ఈ ఆధునిక సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వీర్నపల్లి గ్రామ సర్పంచ్ మల్లరాపు జ్యోస్న అరుణ్, భవుసింగ్ నాయక్ తండా సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్, మండల మార్కెట్ చైర్మన్ లకవత్ రాములు నాయక్, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ అధికారులు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments