Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 10:32 AM

బంజరు గ్రామంలో విజయవంతంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Main Image

స్థానిక ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

కరీంనగర్ జిల్లాలోని బంజరు గ్రామంలో కాత్యాయని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బట్టు కృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బట్టు కృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని, అందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ శిబిరంలో కాత్యాయని కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం గ్రామస్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించింది. సుమారు వందలాది మంది గ్రామస్థులు ఈ శిబిరానికి తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాధితులకు ఉచితంగా మందులు, కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే, శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను గుర్తించి, వారికి తదుపరి వైద్యం కోసం ఆసుపత్రికి సిఫార్సు చేశారు.ఈ కార్యక్రమంలో కాత్యాయని ఆసుపత్రి సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినందుకు గ్రామస్థులు సర్పంచ్ బట్టు కృష్ణకు, ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Clip Adjustments