Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 12:03 PM

మంకమ్మతోట మున్నూరు కాపు సంఘ భవనంలో బోరు, మోటార్ బిగింపు.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన సంఘం అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట మున్నూరు కాపు సంఘ భవనంలో నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రత్యేక నిధులతో సంఘ భవనంలో నూతనంగా బోరు వేయించి, అనంతరం మోటార్‌ను కూడా విజయవంతంగా బిగించడం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముందుండి ఎంతగానో కృషి చేసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ బండి ప్రశాంత్ దీపక్ గారికి మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం తరఫున మరియు వ్యక్తిగతంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు, సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఎప్పుడూ ముందుంటారని, భవనంలో నీటి సమస్య తీరడంతో సంఘ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు పల్లె రామచంద్రం, ఎన్నం దేవేందర్, సోమినేని శ్రీపతి గారు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Clip Adjustments