Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 01:14 PM

తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ప్రజాపాలనకు ప్రేరణ - డా. కవ్వంపల్లి సత్యనారాయణ

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో గౌరవ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఘనంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరిగిన చారిత్రక పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమగ్రాభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని డా. కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు.

ప్రజలకు పూర్తిగా పారదర్శకమైన పాలననందిస్తూ, అణగారిన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సక్రమంగా అందేలా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్రా మిశ్రా గారు, పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్ గారు, అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సత్తు మల్లేష్ గారు, శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు తదితరులు పెద్ద సంఖ్యలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Clip Adjustments