Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 06:31 PM

తెలంగాణ విమోచన దినోత్సవం కరీంనగర్ లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ సాయిని మల్లేశం గారి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ శ్రీ యాదగిరి సునీల్ రావు, అలాగే పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు మరియు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాయకులు దేశభక్తి భావాలను చాటుకున్నారు.

Clip Adjustments