Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 06:51 PM

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య. నిజామాబాద్‌లో కలకలం

Main Image

నిజామాబాద్‌ బ్యూరో / తెలంగాణ అడ్డా:

సుమారు 5 నెలల క్రితం హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబును దుండగులు దారుణంగా హత్య చేశారు. నిజామాబాద్ పట్టణంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ముగ్గురు వ్యక్తులు హరిబాబును వెంబడించి, కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నరికి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Clip Adjustments