Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 07:05 PM

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు కిట్లు అందజేత - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Main Image

హన్మకొండబ్యూరో / తెలంగాణ అడ్డా:

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ ఐడీఓసీలో వరంగల్ జిల్లా సర్వే మరియు రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా సర్వే కిట్లను పంపిణీ చేశారు.భూముల రీ-సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని 131 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు అవసరమైన ఆధునిక పరికరాలతో కూడిన కిట్లను అందజేశారు. భూముల కొలతలు మరియు సర్వే పనులను ఎటువంటి లోపాలకు తావులేకుండా నాణ్యతతో చేపట్టి, రైతులకు మరియు భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, రెవెన్యూ అధికారులు, సర్వే మరియు రికార్డ్స్ శాఖ ఏడీ శ్రీనివాసులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments