Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 09:19 PM

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ - గణేష్ శోభాయాత్ర భద్రతపై అధికారులకు దిశానిర్దేశం

Main Image

వేములవాడ / తెలంగాణ అడ్డా:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి కేసుల దర్యాప్తు తీరు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు మరియు నేరాల నియంత్రణ చర్యలను క్షుణ్ణంగా సమీక్షించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు జరపడం అయినది:డయల్-112 స్పందన: డయల్-112 నుంచి వచ్చే కాల్స్‌పై సిబ్బంది తక్షణమే స్పందించి, వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సహాయం అందించాలని ఆదేశించాను.పెట్రోలింగ్ పటిష్టత: విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ, బ్లూకోల్ట్ మరియు పెట్రోకార్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించాను.గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు: వేములవాడ పట్టణంలో ఈనెల 23న జరగనున్న గణేష్ శోభాయాత్ర మరియు నిమజ్జన కార్యక్రమానికి అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశాను. ఉత్సవ నిర్వాహకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సరైన రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ ఉండేలా చూడాలని, నిర్దేశిత సమయానికి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా ముందస్తు అవగాహన కల్పించాలని ఆదేశించాను.సోషల్ మీడియా నిఘా మరియు డీజేలపై నిషేధం: గణేష్ ఉత్సవాల వేళ సోషల్ మీడియాపై నిఘాను మరింత కఠినతరం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అసత్య ప్రచారాలు లేదా పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. అలాగే, నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాను.

Clip Adjustments