Back to Home
Watermark
శుక్రవారం, 18 సెప్టెంబర్, 2026 TIME : 10:09 AM

రవాణా రంగ కార్మికుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల అందజేత - మంత్రి పొన్నం ప్రభాకర్

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యలో ప్రోత్సహించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ సీఎస్‌ఆర్ (CSR) కింద మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

"యువ మేధస్సుకు ప్రోత్సాహం - ఉజ్వల భవిష్యత్తుకు బాట" అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా. జి. ముకుంద్ రెడ్డి, ఐఏఎస్, శ్రీమతి రక్షిత కె. కృష్ణమూర్తి, ఐపీఎస్, శ్రీ కుమార్ మొలుగారం, శ్రీరామ్ ఫైనాన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ సుదర్శన్ హొల్లా బాల్నాడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మంత్రి పిలుపు:

ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన కోసం నిరంతరం కష్టపడాలని సూచించారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం సూచించినట్లుగా కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి వారికి తగిన గౌరవం తీసుకురావాలని కోరారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత:

ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై కూడా మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న అజాగ్రత్త కుటుంబాలను విషాదంలోకి నెడుతుందని, వాహనం నడిపేటప్పుడు ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలతో కలిసి రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం హక్కుతో పాటు బాధ్యత అని, ప్రమాదాల నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Clip Adjustments