Back to Home
Watermark
శుక్రవారం, 18 సెప్టెంబర్, 2026 TIME : 10:29 AM

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో రెవెన్యూ అధికారుల విచారణ.. 320 ఎకరాల అసైన్డ్ భూమిపై సర్వే కలకలం

Main Image

తెలంగాణ బ్యూరో / తెలంగాణ అడ్డా:

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల విచారణ తీవ్రతరం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు హుటాహుటిన ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.

ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజుపూర్ గ్రామాల్లోని 3 గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 325 సర్వే నంబర్‌లోని అసైన్డ్ భూములపై దృష్టి సారించి, ఆ భూముల కబ్జాలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ రెవెన్యూ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సర్వే సందర్భంగా 'తెలంగాణ అడ్డా' ప్రతినిధులు స్థానికులతో మాట్లాడి పలు కీలక విషయాలు సేకరించారు. ఆ ప్రాంతంలో మొత్తం 320 ఎకరాల భూమి ఉందని, అదంతా దళితులకు సంబంధించిన భూమి అని స్థానికులు వెల్లడించారు. ఆ భూములకు సంబంధించి చాలా మందికి లావణీ పట్టాలు కూడా వచ్చాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Clip Adjustments