Back to Home
Watermark
శుక్రవారం, 18 సెప్టెంబర్, 2026 TIME : 11:38 AM

వేలాల గ్రామంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - భారీగా వాహనాల స్వాధీనం

Main Image

రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామంలో జైపూర్ ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 62 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 1 కారు మరియు 1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు అవగాహన మరియు హెచ్చరికలు:

శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వ్యక్తుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Additional Image

మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, సోషల్ మీడియా భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-112 సేవలు మరియు గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

నేరాల నివారణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వినాయక చవితి ఉత్సవాలు, శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతలను పరిరక్షించడం, పోలీసులకు మరియు ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments