గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష - మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
శాసనసభ కమిటీ హాల్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ మూడో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమీక్షాంశాలు: గోదావరి పుష్కరాల సన్నద్ధత, ఘాట్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు మరియు ఇతర ఏర్పాట్ల పురోగతిపై ఈ భేటీలో సమగ్రంగా సమీక్షించారు.
అధికారులకు దిశానిర్దేశం: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఈ పుష్కరాల పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.