Back to Home
Watermark
ఆదివారం, 20 సెప్టెంబర్, 2026 TIME : 12:22 PM

విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

Main Image

రోజువారీ వేతనం రూ.600 చెల్లించాలి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

వేములవాడ తెలంగాణ అడ్డా సెప్టెంబర్20:

వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం డిమాండ్ చేసింది. రోజువారీ వేతనంగా రూ.600 చెల్లించాలని కోరింది.

వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లి గ్రామంలోని దళితవాడను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తిప్పాపూర్, నాంపల్లి, అయ్యర్‌పల్లి, శాత్రాజుపల్లి, కోనాయిపల్లి తదితర గ్రామాలు సుమారు ఆరు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో విలీనమైనప్పటి నుంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని వారు తెలిపారు.

అభివృద్ధి పేరుతో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ ప్రజలకు ఉపాధి లేకుండా చేయడం సరికాదని సంఘం నాయకులు పేర్కొన్నారు. విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి గూరిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి గ్రామస్తులు పద్మ, సత్తవ్వ, మనవ, రజిత, రాజేశ్వరి, ప్రియాంక, దుర్గవ్వ, లచ్చవ్వ, సుగుణవ్వ, సునీత, శారద తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments