లడ్డూ వేలంలో విజేతగా కట్టం నరేష్ ₹32,100లకు విజయ విఘ్నేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కైవసం

మహా అన్నదానంలో వెయ్యి మందికి పైగా భక్తులు
డాన్సులు, కేరింతల మధ్య ఘనంగా గణనాథుని నిమజ్జనం
తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి:
మణుగూరు మండలం సుందరయ్యనగర్ కుంకుడు చెట్ల గుంపు గ్రామంలో గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ కమిటీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విజయ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాటలో కుంకుడు చెట్ల గుంపు గ్రామానికి చెందిన కట్టం నరేష్ రూ.32,100లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో విజేతగా నిలవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే స్వామివారి కలశం చెంబు వేలంపాటలో సోలం నాగభూషణం రూ.9,100లకు కైవసం చేసుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరో లడ్డూను లక్కీ డ్రా ద్వారా నిర్వహించగా సాయం పూజిత్ విజేతగా నిలిచారు. అనంతరం భక్తులు, స్థానికులు మేళతాళాలతో డాన్సులు చేస్తూ లడ్డూ ప్రసాదాలను విజేతల ఇళ్లకు తీసుకెళ్లారు.

ఘనంగా మహా అన్నదానం
వినాయక మండపం వద్ద నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
విగ్రహదాతలు దూలం దుర్గారావు–అలివేలు దంపతులు, మహా అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వేణు రెస్టారెంట్ బ్రదర్స్, జై భజరంగ్ దళ్ సభ్యులు, పిల్లారిశెట్టి హరిబాబు, అలాగే ఉత్సవ కమిటీ యూత్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ విజయ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
కేరింతలు, డాన్సుల మధ్య నిమజ్జనం
అనంతరం విజయ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో పాల్గొని కేరింతలు, డాన్సులతో సందడి చేశారు. ‘గణనాథునికి జేజేలు’ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ స్వామివారి నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.