నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిని ఆత్మీయంగా సత్కరించిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్‌లోని కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు దుబ్బాసి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా. వి. నరేందర్ రెడ్డి గారు ఆయనను ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు పొన్నం సత్యనారాయణ గౌడ్, గడ్డం శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, తుమ్మ ప్రతాపరెడ్డి, గుండాల రమేష్, చింతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.