మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో కలిసి మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్రావును పరామర్శించిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
అస్వస్థతకు గురై గుండె చికిత్స చేయించుకున్న పెద్దపల్లి జిల్లా ముత్తారం మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు గారిని కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోని వారి నివాసంలో ఐటీ శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా. వి. నరేందర్ రెడ్డి గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.