Back to Home
Watermark
సోమవారం, 21 సెప్టెంబర్, 2026 TIME : 03:01 PM

అక్షర కిరీటి అవార్డు గ్రహీతగా బొమ్మరాతి ఎల్లయ్య

Main Image

అక్షర కిరీటి అవార్డు గ్రహీతగా బొమ్మరాతి ఎల్లయ్య

తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ప్రముఖ రచయిత, శిల్పి, చిత్రకారుడు, సింగరేణి మాజీ ఉద్యోగి బొమ్మరాతి ఎల్లయ్యకు ‘అక్షర కిరీటి’ అవార్డు లభించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలంలోని పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఆయన రచించిన కవితలు, సాహిత్య సేవతో పాటు శిల్పి, చిత్రకారుడిగా అందిస్తున్న సేవలను గుర్తించి ‘అక్షర కిరీటి’ బిరుదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా బొమ్మరాతి ఎల్లయ్య మాట్లాడుతూ.. తాను రచించిన కవితలను కవి సమ్మేళనంలో వినిపించగా నిర్వాహకులు, సాహితీవేత్తల నుంచి ప్రశంసలు లభించాయని తెలిపారు. ‘శ్రీశ్రీ కళావేదిక’ ద్వారా ‘అక్షర కిరీటి’ బిరుదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఇప్పటివరకు 300కు పైగా కవితలు రచించినట్లు ఎల్లయ్య తెలిపారు. వివిధ పత్రికలు, సాహితీ సంస్థల నుంచి పలు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. మణుగూరు సింగరేణి సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇటీవల తాటి ఆకులపై రామాయణ కథను రచించినందుకు ‘అభినవ వాల్మీకి’గా గుర్తింపు పొందినట్లు తెలిపారు.

తన సాహిత్య సేవలను గుర్తించి ‘అక్షర కిరీటి’ అవార్డుతో సత్కరించిన శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులకు బొమ్మరాతి ఎల్లయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Clip Adjustments