Back to Home
Watermark
సోమవారం, 21 సెప్టెంబర్, 2026 TIME : 06:42 PM

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రజావాణి – అర్జీల స్వీకరణ

Main Image

రామగుండం / తెలంగాణ అడ్డా:

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వినతులు: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అందజేశారు.

భయాందోళనలు వీడాలి: ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

సమగ్ర విచారణకు ఆదేశం: ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి, బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments