Back to Home
Watermark
సోమవారం, 21 సెప్టెంబర్, 2026 TIME : 07:07 PM

పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు: బీజేపీపై డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపాటు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బీజేపీ పార్టీ చీప్ రాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటని డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డారు. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాజకీయ లబ్ధికే రాద్ధాంతం: గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలడం లేదంటూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బీజేపీ పండుగ ఏర్పాట్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

నీటి విడుదలపై వాస్తవాలు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపుతో పాటు ఎస్సారెస్పీ (SRSP) నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందేనని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని తెలిపారు.

చీప్ పాలిటిక్స్ మానుకోవాలి: నీటి విడుదల ప్రక్రియను గమనించిన బీజేపీ నాయకులు దానిని తమ ఖాతాలో వేసుకునేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పవిత్రమైన పండుగలను సైతం రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

Clip Adjustments