Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 11:08 AM

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసాలపై ఏసీబీ సోదాలు.. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో నిమ్స్ (NIMS) అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసం మరియు కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న లక్ష్మీభాస్కర్ నివాసంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు బంధువులకు చెందిన ఇళ్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.

Clip Adjustments