Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 11:33 AM

రత్నంపేట గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం సందర్శన

Main Image

రత్నంపేట గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం సందర్శన

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 22:

రత్నంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్‌తో పాటు ప్రజాప్రతినిధులు సందర్శించి కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలకు అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్రంలో ఫ్యాన్లు, విద్యుత్, బల్బుల సదుపాయాలను పరిశీలించారు.

అంగన్వాడీ కేంద్రంలో బాత్రూం సౌకర్యం లేకపోవడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌తో మాట్లాడగా, ప్రొసీడింగ్ అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు, పోషకాహారాన్ని షెడ్యూల్ ప్రకారం అందించాలని, పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా నమోదు చేసి వారి ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించారు.

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్త పద్మకు సూచించారు. పేరెంట్ కమిటీ సభ్యులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెండో వార్డు సభ్యులు యాస అనిల్ కుమార్, మూడో వార్డు సభ్యులు రాగల్ల అంజలి, నాలుగో వార్డు సభ్యులు గడ్డి కమలాకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి సరిత, కారోబార్ మార శ్రీకాంత్, సామల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments