Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 04:17 PM

గణేష్ నిమజ్జనానికి నీటి విడుదల చేయకపోవడం దురదృష్టకరం హిందువుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది చిన్నచూపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సౌకర్యాలు ಕల్పించాల్సింది పోయి, నిమజ్జనాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్‌లో మంగళవారం ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు:

నగరపాలక సంస్థ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చింతకుంట కెనాల్ కాలువకు ఎస్సారెస్పీ నుండి నీరు విడుదల చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా తాము రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరు ఉన్నా చింతకుంట కెనాల్‌కు గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటిని విడుదల చేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా జిల్లా యంత్రాంగానికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయాన్ని విన్నవించారని తెలిపారు.

చింతకుంట కెనాల్‌లో వెయ్యికి పైగా భారీ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని తెలిసినా, కొద్దిమంది నాయకులు నీరు విడుదలైందని, బీజేపీ నాయకులు ఆందోళన చేయడం తప్పుదోవ పట్టించడమేనంటూ అసత్య ప్రచారాలు చేశారని విరుచుకుపడ్డారు. ఈఎన్‌సీ, సీఈ అధికారులు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

నిమజ్జన పాయింట్ల వద్ద లైటింగ్, బారికేడింగ్, క్రేన్ సౌకర్యం లాంటి ఏర్పాట్లు చేసినా నీరు లేకపోతే ఎలా అని నిలదీశారు. మండపాల నిర్వాహకుల కోరిక మేరకు, బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేసిందని స్పష్టం చేశారు.

ఎస్సారెస్పీలో 47 టీఎంసీల నీరు పెట్టుకుని అర టీఎంసీ నీటిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, హిందువుల పండగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ఈ మీడియా సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు పొన్నం లక్ష్మి-మొండయ్య, రామన్, తోట అనిల్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేశశిల్ప-వేదం, సోమిడి వేణు, మాసం గణేష్, కో-ఆప్షన్ సభ్యులు బల్వీర్ సింగ్, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, నాయకులు పండుగ నాగరాజు, భాస్కర్, కటకం లోకేష్, అక్షయ్, రాజ ప్రభాకర్, కుంభం అనిల్, అరకిల శంకర్, సురేందర్, భాస్కర్ రాజశేఖర్, సత్యనారాయణ రెడ్డి, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments