Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 08:05 PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్ వర్కర్ కొండల్ రెడ్డికి ప్రభుత్వ అండ.. నిమ్స్‌లో ఉచిత వైద్యంతో పాటు రూ. 2.77 లక్షల ఆర్థిక సాయం

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్ అండ్‌ ప్లాట్‌ఫామ్ వర్కర్ మెట్టుకుపల్లి కొండల్ రెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండల్ రెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 2,77,500 ఆర్థిక సాయాన్ని అందించారు.

సంఘటన వివరాలు:

తెలంగాణ గిగ్ అండ్‌ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సభ్యుడైన కొండల్ రెడ్డి దాదాపు పదేళ్లుగా ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ కాలంలో 4.76 స్టార్ రేటింగ్‌తో 7,620 ట్రిప్పులను పూర్తి చేశారు.

కొంతకాలంగా కాలేయ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో ఆయన పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆయనకు పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తనకు వైద్య చికిత్స అందించేందుకు సహాయం చేయాలని కొండల్ రెడ్డి ఉబర్ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి వెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు.

ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 2,77,500 చెక్కును కొండల్ రెడ్డికి అందజేశారు.

కొండల్ రెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వమే పూర్తి స్థాయి వైద్య చికిత్స అందించాలని సీఎం గారు ఆదేశించడంతో, అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా TGPWU అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ గారు సీఎం గారికి, కార్మిక శాఖ మంత్రి గారికి, సీఎంఓ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం చేశారు.

Clip Adjustments