Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 09:55 PM

బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో విజిలెన్స్ / ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, కార్యాలయంలో జరుగుతున్న పలు అక్రమాలు, దళారుల (ఏజెంట్ల) ప్రమేయం వెలుగుచూశాయి.

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

రంగారెడ్డి రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో బండ్లగూడలోని సౌత్ జోన్ ఆర్టీవో కార్యాలయంలో ఈ సర్ప్రైజ్ చెక్ రికార్డుస్థాయిలో కలకలం సృష్టించింది.

తనిఖీల్లో వెలుగుచూసిన ప్రధానాంశాలు:

అనుమానాస్పద లావాదేవీలు: కార్యాలయ సిబ్బంది సెల్ ఫోన్లలో కొన్ని అనుమానాస్పద యూపీఐ (UPI) లావాదేవీలను అధికారులు గుర్తించారు.

ఏజెంట్ల రాజ్యం: ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి సంబంధం లేని అనధికార వ్యక్తులు / ఏజెంట్లు దరఖాస్తులతో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు తేలింది.

ప్రత్యేక గుర్తుల దందా: ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులు వేగంగా క్లియర్ కావడానికి కొందరు అధికారులు (ఏఓ బి. సునిత, సీనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ ఇమ్రాన్, జూనియర్ అసిస్టెంట్ కే. బాబుజీ, ఏఓ ఎన్. హేమంత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ కే. సాయికుమార్, ఎం.ఏ. లతీఫ్ ఖాన్ మరియు జూనియర్ అసిస్టెంట్ టి. సాయికాంత్) దరఖాస్తులపై ప్రత్యేక గుర్తులతో పేర్లు రాసే పద్ధతిని పాటిస్తున్నట్లు విచారణలో తేలింది.

భారీగా నగదు స్వాధీనం: తనిఖీ సమయంలో కార్యాలయంలో ఉన్న ఏజెంట్ల వద్ద రూ. 24,760/- నికర నగదు లభించింది.

మిస్ అయిన ఫైళ్లు: సీనియర్ అసిస్టెంట్ సాయికుమార్, జూనియర్ అసిస్టెంట్ సాయికాంత్ వద్ద ఉండాల్సిన (33) రవాణా (ట్రాన్స్‌పోర్ట్) దరఖాస్తులు గైర్హాజరైనట్లు (రికార్డుల నుంచి మాయమైనట్లు) గుర్తించారు.

పాతుకుపోయిన సిబ్బంది: సౌత్ జోన్ ఆర్టీవో కార్యాలయంలో కొంతమంది సిబ్బంది దీర్ఘకాలంగా తిష్ట వేసి పనిచేస్తున్నట్లు గమనించారు. ముఖ్యంగా ఎం.ఏ. లతీఫ్ ఖాన్ చిన్న విరాదాలతో దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే సౌత్ జోన్ కార్యాలయంలో కొనసాగుతుండటం గమనార్హం.

Clip Adjustments