Back to Home
Watermark
బుధవారం, 23 సెప్టెంబర్, 2026 TIME : 08:05 AM

భావుసింగ్ నాయక్ తండాలో వైభవంగా గణేష్ నవరాత్రులు: ఘనంగా కుంకుమ పూజలు, అన్నదానం

Main Image

బంజారా బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో విశేష పూజలు

గణనాథుడి సన్నిధిలో లోకకళ్యాణార్థం మహిళలచే సామూహిక మహా కుంకుమార్చన

తండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: ఉత్సవ కమిటీ

తెలంగాణ అడ్డా వీర్నపల్లి (సెప్టెంబర్ 22):

భావుసింగ్ నాయక్ తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 'భావుసింగ్ నాయక్ తండా బంజారా బాయ్స్ యూత్ అసోసియేషన్' గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తండాలో పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.

లోకకళ్యాణార్థం విఘ్నేశ్వరుడి మండపం వద్ద మహిళలతో అత్యంత భక్తిశ్రద్ధలతో మహా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తండాకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మంగళహారతులు పాడుతూ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా అన్నదాన వితరణ:

కుంకుమ పూజ అనంతరం బంజారా బాయ్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తండా ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు స్వయంగా పంక్తిలో నిలబడి అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తండా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, లంబోదరుని ఆశీస్సులు నిరంతరం అందరిపై ఉండాలనే సంకల్పంతో ఈ పూజలు, అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్, తండా పెద్దమనిషి లింగం నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు భుక్య తిరుపతి, ఉపసర్పంచ్ గూగులోత్ హరిదాష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ అసోసియేషన్ యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Clip Adjustments