Back to Home
Watermark
బుధవారం, 23 సెప్టెంబర్, 2026 TIME : 08:06 AM

గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్

Main Image

గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్

తెలంగాణ అడ్డా సెప్టెంబర్22(సిరిసిల్ల / వీర్నపల్లి):

వీర్నపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలను ప్రజలు, యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా, పరస్పర సమన్వయంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టిందని తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల్లో అధిక శబ్దాలు చేసే డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌కు ఎలాంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు, రోగులకు, వృద్ధులకు మరియు వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యం చేయరాదని సూచించారు.

పోలీస్ శాఖ సూచించిన మార్గదర్శకాలు, నిబంధనలను ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సంబరాలను ప్రశాంతమైన, ఆనందోత్సాహాల మధ్య ముగించుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు.

Clip Adjustments