Back to Home
Watermark
బుధవారం, 23 సెప్టెంబర్, 2026 TIME : 08:10 AM

బూరుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

Main Image

బూరుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అత్యవసరం

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక సమావేశం నిర్వహించిన సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. రక్తహీనత నివారణపై అవగాహన

అంగన్‌వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలువు

తెలంగాణ అడ్డా బోయినిపల్లి సెప్టెంబర్ 22:

బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ సౌమ్య మహేష్ , కార్యదర్శి సందర్శించారు. 'రాష్ట్రీయ పోషణ మాసం' సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సౌమ్య మహేష్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు మరియు ఎదుగుతున్న చిన్నారులు రోజూ సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం అత్యంత కీలకమని తెలిపారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కోడిగుడ్లు, పండ్లు రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని సూచించారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహార సరుకులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం కేంద్రంలో చిన్నారులు, మహిళలు, సిబ్బందితో కలిసి ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, తల్లులు మరియు చిన్నారులు పాల్గొన్నారు

Clip Adjustments