Back to Home
Watermark
బుధవారం, 23 సెప్టెంబర్, 2026 TIME : 12:35 PM

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం

Main Image

ఆదిలాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఆదిలాబాద్‌లోని సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ (SNCU) అగ్ని ప్రమాద బాధితులైన శిశువుల తల్లిదండ్రులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుత పరిస్థితులను బాధితుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడి, పలు కీలక డిమాండ్లు చేశారు.

​ప్రధానాంశాలు:

​వైద్య సిబ్బంది కొరత: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సగం మంది స్టాఫ్, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు.

​మెయింటెనెన్స్ బడ్జెట్ కరువు: ఆసుపత్రులలో కనీసం చీపుర్లు, ఫినాయిల్, దూది, మందులు కొనుగోలు చేయడానికి కూడా సరైన మెయింటెనెన్స్ బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు.

​ఆరోగ్యశ్రీ బకాయిలు: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయంటే, పేద వైద్య రంగాన్ని ప్రభుత్వం ఎంతగా గాలికొదిలేసిందో అర్థమవుతోందని పేర్కొన్నారు.

​ప్రభుత్వానికి నెల రోజులు గడువు: ముఖ్యమంత్రి గారికి తమ పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ ఆదివాసీ గూడల్లో రోడ్ల నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల వివరాలపై ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు.

​భారీ ఆర్థిక సహాయం: అగ్ని ప్రమాద బారిన పడి గాయపడిన ప్రతి శిశువు కుటుంబానికి ప్రభుత్వమే రూ. 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం/ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

​రాష్ట్రవ్యాప్త పర్యవేక్షణ: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధుల లెక్కలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

​పోరాటం ఆగదు: తాము తాత్కాలికంగా వచ్చిపోయే టూరిస్టులం కాదని, ఆదిలాబాద్ తాండాలు మరియు గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం, ప్రజల పక్షాన న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాడుతామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments