ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: పొలాస నరేందర్

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: పొలాస నరేందర్
వేములవాడ, తెలంగాణ అడ్డా: శ్రీ గణేష్ నవరాత్రుల సందర్భంగా వేములవాడలోని శ్రీ శ్రీ శ్రీమధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో విఘ్నేశ్వరుడిని మాజీ సర్పంచ్, ధర్మకర్త, సెస్ డైరెక్టర్, బీసీ నేత పొలాస నరేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకున్నారని తెలిపారు. కుంకుమ పూజలు, అన్నదానాలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకున్నారని పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, నిమజ్జన ప్రదేశాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు, విద్యుత్, మున్సిపల్, ఆలయ సిబ్బంది ఇచ్చే సూచనలను వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించి సహకరించాలని కోరారు.
నిమజ్జన సమయంలో పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు.
వినాయక నిమజ్జనం పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుభిక్షం, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనపర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.