Back to Home
Watermark
బుధవారం, 23 సెప్టెంబర్, 2026 TIME : 09:45 PM

అప్పుల బాధతో వృద్ధుడి బలవన్మరణం

Main Image

అప్పుల బాధతో వృద్ధుడి బలవన్మరణం

కోనరావుపేటలో విషాద ఘటన

తెలంగాణ అడ్డా, కోనరావుపేట, సెప్టెంబర్ 23:

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారం, కుటుంబ పరిస్థితుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట గ్రామానికి చెందిన లింగాపురం వెంకటస్వామి (65) బుధవారం ఉదయం గ్రామ శివారులో మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతుడి భార్య సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనరావుపేట ఎస్సై బి. రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

Clip Adjustments