కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత వరాల నర్సింగంకు ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందా?ప్రతిపక్షం పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు.. కరీంనగర్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఫ్లోర్ లీడర్ కార్పొరేషన్ పీఠం!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్యూఐ (NSUI) విద్యార్థి దశ నుంచి నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, సుమారు నాలుగు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న సీనియర్ నాయకుడు వరాల నర్సింగంకు ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
వరాల నర్సింగంకు ఉన్న బలమైన అర్హతలు: గతంలో డిప్యూటీ మేయర్ భర్తపై 21వ డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన కార్పొరేటర్ వరాల నర్సింగం, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఆయన అంకితభావం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా ఆయనే సరైన అభ్యర్థి అని స్థానిక శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు - కసరత్తు: మరోవైపు, కార్పొరేషన్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైతం కౌన్సిల్లో బలమైన గళం వినిపించడంపై, కార్పొరేషన్లో తమ వ్యూహాలను అమలు చేయడంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అధికార పక్షాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఫ్లోర్ లీడర్ పదవి దక్కించుకునే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాల పరంగానూ ఎప్పుడూ లేనివిధంగా రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.