Back to Home
Watermark
శుక్రవారం, 25 సెప్టెంబర్, 2026 TIME : 01:57 PM

వంట గ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ అలర్ట్. ఈ నెలాఖరు వరకే గడువు

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండగా, హైదరాబాద్ మహానగరం పరిధిలో ఇంకా 12 శాతం మంది వినియోగదారులు పూర్తి చేసుకోలేదు. ఈకేవైసీ పూర్తి చేసుకోని లబ్ధిదారులకు అక్టోబర్‌ 01 నుంచి 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఉండబోదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

గడువు ముగింపు - ఆందోళన: ఈకేవైసీని సెప్టెంబర్‌ 30లోపు పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేయడంతో, ఇప్పటికీ చేయించుకోని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద నిత్యం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. సాధారణ ఎల్పీజీ వినియోగదారులతో పాటు మహాలక్ష్మి, దీపం పథకాల లబ్ధిదారులు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇంటి వద్దే ఫోన్ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే విధానం (హెచ్‌పీ గ్యాస్ ఉదాహరణ):

ముందుగా మొబైల్ ఫోన్‌లోని ప్లే స్టోర్ నుంచి 'హెచ్‌పీ పే', 'ఆధార్ ఫేస్ ఆర్డీ' యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్‌పై క్లిక్ చేసి, గ్యాస్ అకౌంట్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్‌ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి.

హోమ్ పేజీలోని 'మై హెచ్‌పీ' ఆప్షన్‌లోకి వెళ్లి ఎల్పీజీపై క్లిక్ చేయాలి.

అక్కడ కనిపించే 'ఈ-కేవైసీ' ఆప్షన్‌పై క్లిక్ చేసి సూచనలను పాటించాలి.

'క్యాప్చర్ ఫేస్' పై క్లిక్ చేసి మీ ముఖాన్ని స్కాన్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Clip Adjustments