Back to Home
Watermark
శుక్రవారం, 25 సెప్టెంబర్, 2026 TIME : 03:40 PM

కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ నియామకం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ నియమితులయ్యారు.

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఈ మేరకు అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ శుక్రవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ అర్బన్ డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపి, వారి ఆశీస్సులు తీసుకున్నారు.

నేతల అందరికీ కృతజ్ఞతలు: తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్‌లకు ఉదయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి: ఈ సందర్భంగా ఆకుల ఉదయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వాస్తవాలతో తిప్పికొడతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని నగరంలో మరింత బలోపేతం చేసేందుకు, అప్పగించిన నూతన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తామని ఆయన తెలిపారు.

Clip Adjustments