మహిళలు పోటీ ప్రపంచంలో రాణించాలి — కాంగ్రెస్ నాయకురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్

మహిళలు పోటీ ప్రపంచంలో రాణించాలి
— కాంగ్రెస్ నాయకురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ అడ్డా, పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండలో నూతనంగా ఏర్పాటు చేసిన **‘పారూస్ బ్లూమింగ్ స్టూడియో’**ను కాంగ్రెస్ నాయకురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి. చంద్రారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్టూడియో నిర్వాహకులు నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు స్వచ్ఛందంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటూ ఆర్థికంగా ఎదగడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి రాణించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నిహారిక వరప్రసాద్ రెడ్డి, లక్ష్మి, బల్వంత్ రెడ్డి, నాగరాజు, దీననాథ్, శ్రీకాంత్ యాదవ్, స్టూడియో నిర్వాహకులు సురేష్, రామచంద్రారెడ్డి, జంగిరెడ్డి, యువజన నాయకులు దిగంబర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.