Back to Home
Watermark
శుక్రవారం, 25 సెప్టెంబర్, 2026 TIME : 06:05 PM

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటినుంచీ రాజీలేని పోరాటం మాదే సీఎన్జీవోస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌రెడ్డి

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటినుంచీ రాజీలేని పోరాటం చేస్తోంది తమ జేఏసీయేనని సీఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సహకారంతోనే ఉద్యోగుల హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి హామీతోనే తాత్కాలిక విరమణ: ప్రస్తుతం ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోయినా, ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోనే తాత్కాలికంగా ఆందోళనలు విరమించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దసరాకు రెండు డీఏలు, సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని సీఎం నుంచి హామీ లభించిందని తెలిపారు. పీఆర్సీ కమిటీ నియామకం, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, సీపీఎస్ సమస్యలపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ విమర్శలపై స్పందన: గత ప్రభుత్వం కేవలం 5 శాతం ఐఆర్ మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, పదవులు లేని కొందరు వ్యక్తులు జేఏసీ పేరుతో రాజకీయాలు చేస్తూ సోషల్ మీడియాలో నిరాధారమైన ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత సమయం పట్టినా ఉద్యోగుల సమస్యలన్నింటినీ తప్పక పరిష్కరిస్తామని జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Clip Adjustments