కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా సమీక్ష సమావేశం

కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా సమీక్ష సమావేశం
తెలంగాణ అడ్డా, రాజన్న సిరిసిల్ల:
యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కో-ఇంచార్జ్ రోషిని జైస్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ థామస్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ మధు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గత ఆరు నెలల్లో నిర్వహించిన కార్యక్రమాలు, నిరసనలు, సమీక్ష సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్థాయి రివ్యూ సమావేశాలు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు WITH IYC Appను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
ఈ నెల 27వ తేదీలోగా అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశాలు, కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరుకాని వారిపై IYC నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, కొత్త కార్యవర్గ సభ్యులకు అవకాశం కల్పించే అంశంపై చర్చించారు.

ఈ నెల 28న హైదరాబాద్కు రానున్న యూత్ కాంగ్రెస్ నేషనల్ ఇంచార్జ్ మణిశర్మకు ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, సంస్థాగత కార్యకలాపాలను PPT ద్వారా వివరించాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి నెల అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సమావేశం అనంతరం నాయకులు వేములవాడలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని సంకీర్తనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు న్యాత నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగం మురళి, తాళ్లపల్లి విజయ్ రెడ్డి, ఎడ్ల తిరుపతి, జిల్లా కార్యదర్శులు మొకిడే మారుతి, నక్క నవీన్, సందెల శశి కుమార్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు రోమాల ప్రవీణ్ కుమార్, చందుర్తి మండల అధ్యక్షుడు సంతపురి బాలకృష్ణా రెడ్డి, కోనరావుపేట మండల అధ్యక్షుడు బండి ప్రభాకర్, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆరూట్ల మహేష్ రెడ్డి, వేములవాడ అర్బన్ మండల ఉపాధ్యక్షుడు బొమ్మ తిరుపతి, చందుర్తి మండల ఉపాధ్యక్షుడు ఆదిత్య రెడ్డి, నియోజకవర్గ నాయకులు పాకాల వినయ్ గౌడ్, నవీన్, షేక్ ఇర్ఫాన్, అక్కి సునీల్, నరేశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.