Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:36 AM

ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన: సభను విజయవంతం చేయాలి

Main Image

ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన: సభను విజయవంతం చేయాలి

వేములవాడ శ్రీ మహాలింగేశ్వర గార్డెన్‌లో విస్తృత స్థాయి సమావేశం

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు విప్ ఆది శ్రీనివాస్ పిలుపు

సభ ఏర్పాట్లు, జనసమీకరణపై నాయకులతో సమగ్ర చర్చ

హాజరైన సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏటీ యాదవ్

సిరిసిల్ల (తెలంగాణ అడ్డా - స్టాఫ్ రిపోర్టర్):

ఈనెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు వేములవాడ పట్టణంలోని శ్రీ మహాలింగేశ్వర గార్డెన్‌లో గౌరవ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. 

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ విజయవంతం, జన సమీకరణ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు, సీఎం సభను చారిత్రాత్మక విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏ.టి. యాదవ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments