Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 10:52 AM

కవలలకు జన్మనిచ్చి తల్లి మృతి.. తంగళ్లపల్లి మండలంలో విషాదం

Main Image

కవలలకు జన్మనిచ్చి తల్లి మృతి.. తంగళ్లపల్లి మండలంలో విషాదం

తెలంగాణ అడ్డా, తంగళ్లపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం రేణుక ప్రసవం అనంతరం మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రేణుక కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి శనివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.

కాగా, ఇద్దరు శిశువులు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కవలలకు జన్మనిచ్చిన తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Clip Adjustments