Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 12:10 PM

బోయినిపల్లిలో ఘనంగా ‘పోషణ మాసం’: గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాశన బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి వేడుకలు

Main Image

బోయినిపల్లిలో ఘనంగా ‘పోషణ మాసం’: గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాశన

బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి వేడుకలు

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ సౌందర్య

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్‌వాడీల సేవలు ఆదర్శం

హాజరైన ఎంపీడీఓ శ్రీధర్, సర్పంచ్ నల్ల మోహన్, వైద్యాధికారి కార్తీక్

తెలంగాణ అడ్డా బోయినిపల్లి ప్రతినిధి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం సెక్టార్ స్థాయి ‘పోషణ మాసం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా పండ్లు, గాజులు, పౌష్టికాహారం అందించి ఘనంగా సీమంతాలు జరిపించారు. అదేవిధంగా 6 నెలలు నిండిన చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తినిపించి అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ (CDPO) సౌందర్య మాట్లాడుతూ.. గర్భధారణ సమయం నుంచే మహిళలు సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో కీలకమని, తద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారులలో పోషకాహార లోపం లేకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వైద్యారోగ్య మరియు ఐసీడీఎస్ సిబ్బంది సూచనలను తల్లులు క్రమం తప్పకుండా పాటించాలని ఎంపీడీఓ శ్రీధర్ మరియు వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ నిర్మల, స్థానిక గ్రామ సర్పంచ్ నల్ల మోహన్, వార్డు సభ్యులు, హెల్త్ సూపర్వైజర్ శారద, ఏఎన్‌ఎం వరలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments