Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:38 PM

కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. మంత్రులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న 'అల్ఫోర్స్' నరేందర్ రెడ్డి

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చారిత్రాత్మకమైనవని, బడుగు, బలహీన వర్గాలకు ఆయన అందించిన ఆసరిలేని చేయూత ఎప్పటికీ చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు 'అల్ఫోర్స్' డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా బస్ స్టేషన్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీళ్ల శాఖ మంత్రులు డా. వాకిడి శ్రీహరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 'అల్ఫోర్స్' డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే & తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ప్రభుత్వ విప్ & మానకొండూరు శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కరీంనగర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాయకులు, శ్రేణుల హాజరు: ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అర్ష మల్లేశం, ఆకారపు భాస్కర్ రెడ్డి, పొన్నం సత్యం గౌడ్, ఎం. మోహన్, సిరాజ్ అహ్మద్, ఎం. చంద్రశేఖర్, కార్పొరేటర్లు జగన్ రెడ్డి, పర్వతాల మల్లేశం, గుమ్మడి రాజకుమార్, కే. బాలరాజు, సరిల్ల ప్రసాద్, కరీంనగర్ సిటీ మహిళా అధ్యక్షురాలు రజిత రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహాద్‌తో పాటు పలువురు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.

Clip Adjustments