Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:45 PM

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్య, విద్యా రంగాలు: ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

Main Image

పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు అభివృద్ధి చెందుతున్నాయని, పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో ఊరట కల్పిస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ మరియు కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.

భారీగా చెక్కుల పంపిణీ: పెద్దపల్లి నియోజకవర్గంలోని 367 మంది లబ్ధిదారులకు రూ.1,65,94,650 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, అలాగే పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి చెందిన 91 మంది లబ్ధిదారులకు రూ.91,10,556 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ బలోపేతం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ విద్య, వైద్యానికి ప్రాధాన్యత: గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు ఆధునీకరిస్తున్నామని తెలిపారు.

అభివృద్ధి పనులు: పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తెస్తామని, బైపాస్ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు.

Clip Adjustments