Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:51 PM

వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు..

Main Image

వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు..

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ - మన రజక కుటుంబాల ఐక్యవేదికమణుగూరు.

తెలంగాణ అడ్డా ( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

పినపాక నియోజకవర్గం మణుగూ రు ఎంట్రెన్స్ అభయాంజ నేయ దేవాలయం వద్ద నిర్మించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మన రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ. రాజ్యాంగం ప్రకారం ఒకే న్యాయం, ఒకే చట్టం అని చెబుతున్నా, రజకుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 18 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చగా, తెలంగాణతో సహా మిగతా రాష్ట్రాల్లో మాత్రం బీసీలుగానే కొనసాగిస్తు న్నారని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులకు, అధికారులకు విన్నవించినా తెలంగాణ రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు.ఇకనైనా నాయకులు, ప్రభుత్వ అధికారులు కళ్లు తెరిచి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.నేటికీ రజకులను వెట్టిచాకిరి చేసే యంత్రాలుగా, పనివాళ్లుగా చూస్తున్నారని, కానీ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు శుభకార్యమైనా, అశుభకార్యమైనా రజకుడు లేనిదే ఏ కార్యక్రమం జరగదని గుర్తు చేశారు.

ఇది మరిచి కొంతమంది పెద్దలు కుల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రపంచానికే స్వచ్ఛ భారత్ ను నేర్పింది రజకుడే, శుచిశుభ్రతను పరిచయం చేసిందే రజక జాతి అని వారు గర్వంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు, పెద్ద ఎత్తున రజక కులస్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Clip Adjustments