నేడు దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం.. మంగళవారం CWC సమావేశం ప్రత్యేకం!

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు దిల్లీకి పయనం కానున్నారు. సోమవారం దిల్లీలో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాలతో పాటు, మంగళవారం జరగబోయే అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, అమలువుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు: సిరిసిల్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో పాటు, కరీంనగర్‌లోని నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, జిల్లా కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు వేర్వేరు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.