Back to Home
Watermark
ఆదివారం, 27 సెప్టెంబర్, 2026 TIME : 04:41 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Main Image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ అడ్డా ( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments